05/11/2026, Thursday · 09:02:26 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 8:14 PM రాష్ట్ర వార్తలు 4

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Want this news as a newspaper clip?Print News Clip
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూట‌మిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజ‌న్ త‌ర‌హా అభివృద్ధి, సంక్షేమ పాల‌న ప్రజల‌కు అందుతాయని ఇంధనశాఖా మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరుశాతం కూటమి అభ్యర్థులే గెలవాలని ఇంధనశాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ.. ప్రజలతో ముచ్చటించారు. ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ భాష్యం రామకృష్ట ఉన్నారు.రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ భాష్యం రామకృష్ణతో కలిసి ఆయన జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంటతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రజలకనుద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలపించాలని మంత్రి ప్రజలను కోరారు. కూటమి గెలుపు కోసం కార్యకర్తలు పార్టీలకతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ అధికారంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. దానితోపాటు కూటమి ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.

అమరావతి రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడుగడునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే నష్టపోతారని మంత్రి ప్రజలను హెచ్చరించారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవడంలో మంత్రి నిమ్మల రామానాయుడి పాత్రను గొట్టిపాటి కొనియాడారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. 40 రోజుల్లోనే సుమారు రూ. 950 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందేలా నిమ్మల చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. అనంతరం కూటమి తరఫున పోటీచేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు కండువాలు కప్పి అభినందించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Ravi KumarTripleenginedevelopmentalliancewinslocalelections

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News