05/11/2026, Thursday · 08:58:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 2:27 PM రాష్ట్ర వార్తలు 16

ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ
Want this news as a newspaper clip?Print News Clip

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన ఫ్రిస్కోకు చెందిన ప్రవాసాంధ్రుడు సతీష్ మండువ అభినందన సభ ఆదివారం నాడు డల్లాస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక నాయకులు హాజరై అమెరికా–ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించేందుకు తమ మద్దతు తెలిపారు.అమెరికా కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలతో అనుసంధానించడం తన ప్రధాన బాధ్యత అని సతీష్ మండువ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నంలో గూగుల్ ప్రతిపాదించిన ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టు, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను పెంచుతున్నాయని వివరించారు. టెక్నాలజీ, ఇంధనం, తయారీ, వైద్యం, విద్యా రంగాల్లో అమెరికా సంస్థలతో భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించిన పలువురు ఇన్వెస్టర్లు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తనకు సహకరించనున్న సలహాదారుల బృందం పాటిబండ్ల అనీల్, నక్కా కిషోర్, కృష్ణకుమార్, గోనుగుంట్ల నీలిమ, నన్నపనేని సతీష్‌లను మండువ పరిచయం చేశారు. ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా, ఐటీసర్వ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 2000కు పైగా ఐటీ కంపెనీలకు సేవలందించిన సతీష్ అమెరికా–ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, పరిశోధన, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. అశోక్ మాగో జీ, నీతి ఖైతాన్, డా. రాజు కోసూరి, గనపురం మహేందర్, మైని సునీల్, డా. ఉషా పేరి, జూపూడి సంజయ్, కృష్ణ కొరాడ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

satish mamduvauttaraamerikaloepipettubadulasamanvayakartaga

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News