వైసీపీ పాలనలో ఏపీకి తీరని నష్టం: సీఎం చంద్రబాబు

వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజమండ్రి నుంచే కూటమి ఏర్పాటుకు బీజం పడిందని, 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లను అధిగమించామని, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ 97 శాతం పంటల సాగు జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వెళ్తే నగర బహిష్కరణ చేశారని ఆరోపించారు. తనను సైతం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి వేధించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమండ్రి నుంచే కూటమి ఏర్పాటుకు బీజం పడిందని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేదని విమర్శించారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులను మళ్లించి.. పథకాలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పథకాలన్నింటినీ పునరుద్ధరించామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హింసను విడనాడి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి బీ-ఫారం పొందిన అభ్యర్థులకే ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఎన్నికలు తమ పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పని, 2024 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తితో రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యత మెరుగుపడే అవకాశముందని తెలిపారు. ఈ ఎన్నికలు తమ పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పుగా భావిస్తున్నామని, ప్రజల మద్దతు తమకు మరింత శక్తిని ఇస్తుందని చెప్పారు. 2024 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












