05/11/2026, Thursday · 08:34:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

28 జిల్లాల జెడ్పీ స్థానాలు కూటమికే దక్కాలి.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 4:28 PM రాష్ట్ర వార్తలు 16

28 జిల్లాల జెడ్పీ స్థానాలు కూటమికే దక్కాలి.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : కూటమి పార్టీల ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రశాంతంగా జరుగుతోన్న ఎన్నికలను చెడగొట్టాలని పులివెందులలో ప్రయత్నించారని విమర్శించారు. హింస సృష్టించాలని కూటమి పార్టీలను కవ్వించినా... సంయమనం పాటించారన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమని సీఎం వెల్లడించారు. 28 జిల్లాల జెడ్పీ స్థానాలను కూటమి పార్టీలే కైవసం చేసుకోవాలని... ఆ మేరకు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవాలన్నారు. అలాగే ప్రతి మండలంలోనూ కూటమి జెండాలు రెపరెపలాడాలని.. ఆ దిశగా ఎంపీటీసీ స్థానాల్లో పైచేయి సాధించాలని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని... ప్రతి ఇంటికీ సంక్షేమం అందించామన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని... కూటమి స్పూర్తితో అందరూ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర - రాష్ట్రాలతోపాటు... స్థానికంగానూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికలపై తాను, పవన్ కల్యాణ్, మాధవ్ చర్చించుకుంటున్నామని తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు.

‘మన ఓట్లు మనం వేయించుకునేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఓ పక్క స్థానిక ఎన్నికల హడావుడి ఉండగానే.. ఆర్నబ్ తుఫాన్ సహయక చర్యలు చేపట్టాం. ఆర్నబ్ తుఫానులో పెద్ద ఎత్తున విద్యుత్ స్థంభాలు కూలిపోయి.. విద్యుత్ వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యుత్ వ్యస్థను పునరుద్ధరించాం.. కూలిన స్థంభాలను తిరిగి ఏర్పాటు చేశాం. ఇప్పుడు మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీనిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Chandrababu Naiduseatsdistrictsforgeddirectionleaders

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News