05/11/2026, Thursday · 08:34:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

శ్రీవారి ఆలయంలో 750 శాసనాల డిజిటలైజేషన్‌

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:30 AM తిరుపతి 15

శ్రీవారి ఆలయంలో 750 శాసనాల డిజిటలైజేషన్‌
Want this news as a newspaper clip?Print News Clip

భారత్‌-శ్రీ ప్రాజెక్టులో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని 750 శాసనాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) ప్రారంభించింది. 1889, 1904, 1912, 1916 సంవత్సరాల్లో ఆలయ రెండవ ప్రాకారం నుంచి 44 శాసనాలను సేకరించారు. ఆ తర్వాత 2008-09 సంవత్సరంలో గర్భాలయం (ఆనంద నిలయం) గోడల నుంచి మరో 53 శాసనాలను సేకరించే ప్రక్రియను ఏఎస్ఐ ప్రారంభించింది.

గతంలో టీటీడీకి చెం దిన ప్రముఖ శాసన పరిశోధకులు సాధు సు బ్రహ్మణ్య శాస్త్రి తిరుమలలోని శాసనాలను పరిశీలించి వాటిపై కొన్ని సంపుటాలను ప్రచురించారు. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల అ నేక శాసనాలు ఇప్పటికీ అందుబాటులోకి రా లేదు. ఈ 750 శాసనాలు తిరుమల శ్రీవారికి సంబంధించిన రాజకీయ, మతపరమైన, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందించనున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Srivari TempleDigitizationinscriptions

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News