తుఫాను నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సులభతరమైన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. నిరంతర అన్నప్రసాద పంపిణీ, పటిష్టమైన క్యూ లైన్ల నిర్వహణ, వైద్య సహాయం, ఘాట్ రోడ్ల భద్రతపై అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.