శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారు.

ముందుగా ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్ తో కలిసి సాదర స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఉపరాష్ట్రపతి, మంత్రి సహచర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు.
దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో, జేఈవో, ఎమ్మెల్యే గారు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను గౌరవ ఉపరాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












