సిపిఎం అభ్యర్థి మురళి పై దాడి చేసిన రాఘవరెడ్డి డ్రైవర్ ఏసు పై చర్యలు తీసుకోవాలి

- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్ డిమాండ్
సిపిఎం అభ్యర్థి ఎంపిటిసిగా నామినేషన్ వేయడానికి వెళ్లిన మురళి పై ప్రత్యక్షంగా దాడి చేసిన రాఘవరెడ్డి డ్రైవర్ యేసు,అలాగే మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, సిపిఎం టౌన్ కార్యదర్శి సత్యనారాయణ లు డిమాండ్ చేశారు. పొద్దుటూరు సిపిఎం పార్టీ ఆఫీసులో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండవ దంతర్లో మధ్యలో ఎండిఓ ఆఫీస్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు, ఉండడం దుర్మార్గమని తెలిపారు. ఏసు అనే వ్యక్తి రాఘవ డ్రైవర్ అనే పేరుతో దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గం అని తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు గుమి గుడి భయభ్రాంతులకు గురి చేయడం, చించేయడం, అమ్మనా బూతులు తిట్టడం, వీరు మాట్లాడం చూస్తే మనమేమన్నా అటవీక సమాజంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.సిపిఎం అభ్యర్థి అయిన మురళి పై ప్రత్యక్షంగా దాడి చేయడం దారుణమని తెలిపారు .ఈ తరుణంలో డిఎస్పి గారి దృష్టి తీసుకెళ్లామన్నారు. అయినప్పటికీ పోలీసుల మరొక దారుణమైన సంఘటన పోలీసులు వారి సమక్షంలోనే పేపర్లు గుంజుకొని చించేసి ,దాడులు చేయడం అనేది సరైనది కాదని తెలిపారు. ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. విశ్వము పేతురు సర్వేశ్వరి, భాస్కరు, యేసయ్య ఈ ప్రెస్ మీట్ లో తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదు ఇచ్చిన వెంటనే తక్షణమే స్పందించిన రిటర్నింగ్ ఎన్నికల అధికారి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













