కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టుల....

- రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది...ప్రజాస్వామ్యానికి ఇదేనా రక్షణ...
- అరాచక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు...
- అధికారం శాశ్వతం కాదు.. ప్రజాస్వామ్యమే శాశ్వతం! ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు
కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉన్న నాయకులను వేలాది మంది పోలీసులు వచ్చి బలవంతంగా అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్‌తో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కార్యాలయాల్లో సమావేశమయ్యే హక్కు లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే హక్కును అడ్డుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యం...
కడప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై, పోలీసు యంత్రాంగంపై ఉంది. అరెస్టులకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలి.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో అణచివేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల హక్కులను హరించే వారికి సరైన సమయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













