బండి దీప్తి కి మద్దతుగా బి. అంజాద్ భాష

ఈరోజు కడప నగరంలోని కడప నగరంలోని 38,39,41వ డివిజన్లలో గౌస్ నగర్, రిజ్వాన్ మస్జిద్, నకాష్, కటిక వీధి నుండి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను, ఓటర్లను కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి , ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష మాట్లాడుతూ, కడప నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని, ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, కడప నగర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ అధ్యక్షులు బిహెచ్ఇలియాజ్ మాజీ కార్పొరేటర్లు షంషేర్,అలీ అక్బర్, ఆప్షన్ సభ్యులు మాజీ జహీర్, ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్ జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి మాజీ వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కరిముల్లా, డివిజన్ ఇన్చార్జ్ సలీం, జిల్లా మహిళా అధ్యక్షురాలు టి పి వెంకటసుబ్బమ్మ, నగర ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు డాక్టర్ అజ్గార్ అలీ ఖాన్, కార్యదర్శి మాస్టర్ అహమద్, నాయకులు సుబ్బారెడ్డి రాంప్రసాద్ రామకృష్ణ, మహమ్మద్ అలీ, అతావుల, ఎంజె.నయీమ్ మల్లికార్జున రెడ్డి గౌస్, బన్న తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













