కడప 33, 34 డివిజన్లలో కూటమి ఎన్నికల శంఖారావం..

- ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు.
కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ గారి గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఇందులో భాగంగా 33, 34 డివిజన్ల పరిధిలోని రాజారెడ్డి వీధి పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద నుండి టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుస్తూ.. కడప నగర సమగ్రాభివృద్ధి, పారదర్శక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ గారిని, అలాగే డివిజన్లలోని కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













