05/11/2026, Thursday · 09:02:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కమిటీ బృందం నిరసన.

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:39 PM వైఎస్సార్ కడప 9

కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కమిటీ బృందం నిరసన.
Want this news as a newspaper clip?Print News Clip
  • బి.మఠం జడ్పిటిసి సిపిఎం అభ్యర్థి గండి సునీల్ కుమార్ ను అడ్డుకున్న టిడిపి గుండాలు.
  • జిల్లా కలెక్టర్ కు డిఆర్ఓ ద్వారా ఫిర్యాదు చేసిన సిపిఎం అభ్యర్థి.
  • ఎస్పీ గారు సిపిఎం నామినేషన్ వేపించండి.
  • స్వేచ్ఛగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి.
  • 12 గంటలు గడుస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాలు రాలేదంటున్న జిల్లా అధికారులు.

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.

------------------------------------------

2026 అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు, కడప స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కమిటీ కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం మండలం జడ్పిటిసి స్థానానికి సిపిఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేయనున్న గండి సునీల్ కుమార్ గారిని నామినేషన్ వేపించడానికి వెళ్లడంతో, జిల్లా పరిషత్ కు వెళ్లే మూడు దార్లు మూసి వేస్తూ, ముళ్ళ కంచెలు వేసి, ఎవరూ పోకుండా పోలీసులు కాపలా ఉన్నారని, టిడిపి శ్రేణులు మూడు టీములుగా ఏర్పడి, మొదటి టీము నామినేషన్ పత్రాలను లాక్కొని చించి వేసే పని చేస్తున్నారని, వారికి సాధ్యపడకపోతే మరొక టీం దాడి చేసి, కొట్టి లాక్కొని పరిగెత్తుకుని వెళ్తున్నారని, చివరి టీము మీరు నామినేషన్ వేయలేరు ఇక్కడ నుండి వెళ్ళండి అని పోలీసులతో కలిసి చెప్పుతూ పంపించేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ తెలిపారు. అనంతరం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం కు వెళ్లి డిఆర్ఓ మల్లికార్జునుడు గారికి పోలీస్ రక్షణతో సిపిఎం అభ్యర్థి నామినేషన్ ఏపించాలని వారి ద్వారా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి నేను వెంటనే మీ ఫిర్యాదును పంపించి, మీకు రక్షణ కల్పించి, మీ నామినేషన్ వేపించడానికి ప్రయత్నిస్తానని వారు హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు వేపించాలని, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పౌర హక్కుల రక్షణతో ఎన్నికల ప్రక్రియ జరగాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షం ఎప్పుడో ఏదో చేసిందని, పాలకపక్షం అదే ఈరోజు చేస్తామని బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటు పని అన్నారు. హింస ప్రవృత్తిని, అప్రజా స్వామ్య పద్ధతులను, దౌర్జన్యాన్ని ప్రజలు ఎప్పుడూ సహించరని, అలాంటి వారిని ఓడిస్తారని గత ఎన్నికల చరిత్ర చూస్తే ఎవరికైనా అవగతం అవుతుందని హెచ్చరించారు. శాంతియుత మార్గంలో, ప్రజల అజెండాతో, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం ద్వారానే గెలుస్తారని హితో పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, ఏ.రామ్మోహన్, బి.మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు కె.సత్యనారాయణ, కె.శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి, వామపక్షాల నాయకులు ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి జయవర్ధన్, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, సిపిఎం నాయకులు కుమార్ స్వామి రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి బండి సుమంత్, వి.రవికుమార్, బ్రహ్మంగారిమఠం మండలం కమిటీ సభ్యులు అజయ్, రాహుల్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

team protestCPMdistrictcommitteefrontCollectoroffice

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News