05/11/2026, Thursday · 09:02:26 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పులివెందుల మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగరవేస్తాం

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 4:44 PM వైఎస్సార్ కడప 8

పులివెందుల మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగరవేస్తాం
Want this news as a newspaper clip?Print News Clip
  • పులివెందుల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ టౌన్ గా తీర్చి దిద్దుతాము
  • ఇంటింటా ప్రచారంలో టిడిపి శ్రేణులు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పులివెందుల మున్సిపాలిటీలో ప్రజాదరణతో పసుపు జెండా ఎగరవేస్తామని టిడిపి సీనియర్ నాయకుడు తుగుట్ల మధుసూదన్ రెడ్డి ఇంటింటా ప్రచారంలో పేర్కొన్నారు. బుధవారం స్థానిక మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయంలో ముందుగా పరమేశ్వరునికి టిడిపి నాయకులు మహిళలు కలిసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పులివెందులలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ టిడిపి చైర్పర్సన్ అభ్యర్థి గీత కుమారికి తమ విలువైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా తుగుట్ల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీని గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో డబ్బులు దోచుకున్నారే తప్ప అభివృద్ధి అరకొర చేశారని, పులివెందుల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,

పులివెందుల పట్టణంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా సిమెంట్ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాల వంటి ప్రాథమిక మౌలిక వసతుల మెరుగుదలకు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, పులివెందుల మున్సిపాలిటీ రాష్ట్రంలోని ఒక మోడల్ టౌన్ గా తీర్చి దిద్దుతామని, స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందుల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని గడిచిన దశాబ్దాలుగా కుటుంబ సభ్యుల పాలనలో అస్తవ్యస్తమైన విధానాలతో పులివెందుల అభివృద్ధి ఆశించిన మేర సాగలేదని, కూటమి ప్రభుత్వానికి ఒకసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి మరియు సంక్షేమాలను ప్రజలకు దగ్గర చేస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

పులివెందుల మున్సిపాలిటీలో పసుపు జెండా ఎగరవేస్తాం

yellow flagFlymunicipality

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News