05/11/2026, Thursday · 09:02:29 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాష్ట్రస్థాయిలో ఇర్ఫాన్ బాషాకు కీలక బాధ్యత!

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 8:17 PM వైఎస్సార్ కడప 6

రాష్ట్రస్థాయిలో ఇర్ఫాన్ బాషాకు కీలక బాధ్యత!
Want this news as a newspaper clip?Print News Clip
  • కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి PCC కోఆర్డినేటర్‌గా ఇర్ఫాన్ బాషా నియామకం!

ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషాకు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.

ఈరోజు విడుదలైన APCC అధికారిక నియామక ఉత్తర్వుల్లో ఇర్ఫాన్ బాషా పేరును ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు అవగాహన లక్ష్యంగా చేపట్టిన ఈ కాంపెయిన్లో పార్టీ నాయకులతో సమన్వయం చేస్తూ ఇర్ఫాన్ బాషా కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ బాధ్యతల్లో భాగంగా ఇర్ఫాన్ బాషా ప్రధానంగా నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలపై దృష్టి సారించనున్నారు.

ప్రొద్దుటూరు నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతల దిశగా ఇర్ఫాన్ బాషా ప్రస్థానం!

స్థానిక ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, పార్టీ ఉద్యమాలైన, ప్రజాస్వామ్య కార్యక్రమాలైన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఇర్ఫాన్ బాషా చూపిన చొరవ, కృషి, ప్రజా గొంతుకగా ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Irfan Bashakeyresponsibilitystatelevel

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News