నవధాన్యాలు వేద్దాం భూసారాన్ని పెంచుదాం*

నవధాన్యాలు వేద్దాం భూసారాన్ని పెంచుదాం అని,
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్ వి ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు
లింగాల మండలం అక్కులాగారిపల్లి గ్రామం లోని చీని రైతు నర్రాల రామ్మోహన్ రెడ్డి, పెద్దకూడాలా ఎక్స్ ఆర్మీ గోపాల్ రెడ్డి పొలం లో ప్రధాన పంట చీని మధ్యలో నవధాన్యాలు విత్తనాలు 5 ఎకరాలు విత్తడం జరిగింది
ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నవధాన్యాలు వేసుకోవడం వలన
ఆర్గానిక్ కార్బనము వస్తుంది అదేవిధంగా నవధాన్యాల మొక్కల వేర్ల నుండి భూమికి కావలసిన పోషకాలు అందుతాయి నీటిని భూమిలో పట్టి ఉంచే గుణాన్ని కలిగించుతాది అదే విధంగా ప్రధాన పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందిస్తాయి
పీఎండీయస్(నవధాన్యలు )
సాగు చాలా మంచిది ప్రతి రైతు కూడా
కాలి భూముల్లో వేసుకొని
వాటిని చెట్లు మోదుల్లో అచ్చదన గా పశువు లకు
మెత గా వాడు కోవచ్చు అన్నారు .
ప్రకృతి వ్యవసాయ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ జయ నాయక్ మాట్లాడుతూ నవదన్యాలు కాలిగా ఉన్న
పొలాల్లో వేసుకోవడం వలన
ఆ మొక్కలు వేర్లు నుండి భూమి సారవంత మైన మట్టిని కొట్టుకొని పోకుండా
కాపాడుతుంది భూమి గుల్లబారి నీటిని పట్టి ఉంచుకొనే గుణాన్ని కలుగు తుంది ప్రధాన పంటకు కావలసిన పోషకాలు అందుతాయి అన్నారు
ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది , ఐసీర్పీ. ,యశోద, ,రైతులు పాల్గొన్నారు
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












