05/11/2026, Thursday · 09:02:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కడప, రాజంపేట, మైదుకూరు అభ్యర్థులకు అవకాశం

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 9:56 AM వైఎస్సార్ కడప 10

కడప, రాజంపేట, మైదుకూరు అభ్యర్థులకు అవకాశం
Want this news as a newspaper clip?Print News Clip
  • కలెక్టరేట్‌లోనూ మున్సిపల్ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు..!
  • జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి.. కడప నగరపాలక సంస్థ, రాజంపేట, మైదుకూరు పురపాలక సంఘాల్లోని నిర్దేశిత వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు.

అక్టోబరు 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్ణయించిన ఆయా మున్సిపాలిటీల నామినేషన్‌ కేంద్రాలతో పాటు జిల్లా కలెక్టరేట్‌లోనూ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపారు.

కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు..

* కడప నగరపాలక సంస్థ : కలెక్టరేట్‌లోని సభాభవన్

* రాజంపేట పురపాలక సంఘం : కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు

* మైదుకూరు పురపాలక సంఘం : కలెక్టరేట్‌లోని ప్రజా పీజీఆర్ఎస్ హాలు

నిర్దేశించిన మున్సిపాలిటీలోని సంబంధిత వార్డుల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్ణీత తేదీలు, సమయాల్లో తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Kadapa RajampetOpportunitycandidatesMaidukur

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News