పంతం నెగ్గించుకున్న పనతల

- పోరాటం ఆగలేదు.. పుట్టిక రమణ నామినేషన్ దాఖలు
కడపలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ పుట్టిక రమణ గారు 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
గతంలో నామినేషన్ ప్రక్రియలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో, ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారు పాల్గొని పుట్టిక రమణ గారికి మద్దతుగా నిలిచారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. ఆ హక్కును గౌరవిస్తూ, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలి.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












