పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ

- నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ
- నామినేషన్ కేంద్రాలకు 500 మీటర్లు, 100 మీటర్ల పరిధిలో చెక్‌పోస్టుల ఏర్పాటు
- డ్రోన్స్ మరియు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా
- నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 112కు ఫిర్యాదు చేయవచ్చు
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది.
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నామినేషన్ కేంద్రాలకు 500 మీటర్లు, 100 మీటర్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, పరిస్థితులను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, అభ్యర్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
ప్రజలకు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ డయల్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












