బీఈడీ కళాశాలలకు కొమ్ముకాస్తున్న యూనివర్సిటీ అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలి:

- ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.
యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కన్వీనర్ కోట సీట్లను సైతం లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొమ్ముకాస్తున్న యూనివర్సిటీ అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) ఆధ్వర్యంలో కడప రాజీవ్ పార్క్ వద్ద గల యోగివేమన విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ...
యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కన్వీనర్ కోట లో సీటు పొందిన విద్యార్థుల నుండి లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేయడం దారుణమన్నారు. బీఈడీ కళాశాలలు అన్ని ఒక సిండికేట్ గా ఏర్పడి కన్వీనర్ కోట సీట్లను సైతం లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నా యూనివర్సిటీ అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారని వారు విమర్శించారు. కనీసం బీఈడీ కళాశాలల అడ్రస్ కూడా ఎక్కడ ఉందో తెలియకుండా కేవలం డబ్బులకోసమే అడ్మిషన్స్ నిర్వహిస్తూ ఎలాంటి తరగతులు సైతం నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు వాటికి కొమ్ముకాస్తున్నారని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బీఈడీ కళాశాలలపై యూనివర్సిటీ అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటి అక్రమాలకు వంతపాడుతూ మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని వారు తెలిపారు. నిబంధనలు పాటికుండా తరగతులు సైతం నిర్వహించకుండా కన్వీనర్ కోట సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కళాశాలలపై చర్యలు తీసుకునే విధంగా యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వారు కోరారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి నాయకు అఖిల్, బాలు, అంజి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












