05/11/2026, Thursday · 09:02:49 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సిపిఎం నామినేషన్ల స్క్రూట్నీ తర్వాత తిరస్కరణ పై న్యాయపోరాటం చేస్తాం

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 1:48 PM వైఎస్సార్ కడప 16

సిపిఎం నామినేషన్ల స్క్రూట్నీ తర్వాత తిరస్కరణ పై న్యాయపోరాటం చేస్తాం
Want this news as a newspaper clip?Print News Clip

✓ సిపిఎం నామినేషన్ల స్క్రూట్నీ తర్వాత తిరస్కరణ పై న్యాయపోరాటం చేస్తాం. ✓ కమ్యూనిస్టులు ప్రజా సంబంధాల్ని పటిష్టం చేసుకోవాలి.

✓ చట్టబద్ధమైన ఎన్నికల అవకాశాలను అడ్డుకుంటున్న పాలక ప్రభుత్వాలు.

✓ ప్రతిపక్షాలను తుద ముట్టించాలన్న వైఖరిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.

✓ దుతరాష్ట్రుని కూటమి కొలువులో విధురుడు లాంటి సొంత పార్టీ వారే ఎన్నికల నేరాలను ప్రశ్నిస్తున్నారు.

✓ ప్రజల్లోని చైతన్యాన్ని విస్మరించి ఎన్.డి.ఏ.కూటమి దౌర్జన్యాలు చేస్తోంది.

✓ నాడు వైసిపి చర్యలనే తిరిగేసినామంటున్నా పాలకకూటమి వైఖరిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.

✓ ప్రజల స్వేచ్ఛనుహరించే వారిపై 2029 ఎన్నికల్లో ప్రజల తీర్పు కఠినంగా ఉంటుంది.

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.

------------------------------------------

2026 అక్టోబర్ 28వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు, బద్వేలు స్థానిక కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య భవనం, సిపిఎం కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ విస్తృత సమావేశం బద్వేలు మున్సిపాలిటీ 21వ వార్డు సుందరయ్య కాలనీ, సిపిఎం అభ్యర్థి మోక్షమ్మ నామినేషన్ను అధికారపార్టీ ప్రలోభాలకు లొంగి ఎన్నికల అధికారి ఏకపక్షంగా తొలగించడం పై, జిల్లా కలెక్టర్ గారు సదరు ఎన్నికలఅధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామ్రేడ్ పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... జిల్లాలోని మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్క్రూట్నీ తర్వాత తరవాత సిపిఎం నామినేషన్ల తిరస్కరణలపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కమ్యూనిష్టులు ప్రజా సంబంధాల్ని పటిష్టం చేసుకోవడానికి బహిరంగా ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో సత్యశోధక శక్తి పెరుగుతోదన్న దాన్ని పాలకవర్గాలు గమనించకుండా పెడధోరణి ఆలోచనలతో దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయంతో ఎన్నికయ్యే అవకాశాల్ని, ఓటర్లు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసుకునే అవకాశాలను పాలక ప్రభుత్వాలు లేకుండా చేస్తూ అక్రమపద్ధతుల్లో ఏకగ్రీవాలు వేయడాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను తుది ముట్టించాలన్న పాలక పార్టీల వైఖరులను ప్రజలు హర్షించరని హెంచరించారు. దృతరాష్ట్రుని కూటమి కొలువులో విధురుడు లాంటి సొంత పార్టీ వారే ఎన్నికల దౌర్జన్యాలను, క్రూరమైన హింసలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రజల్లో వస్తున్న సత్యశోధక శక్తి, చైతన్యం విస్మరించి ఎన్డీఏ కూటమి పార్టీలు స్థానిక సంస్థలు ఎన్నికల్లో హింస ప్రవృత్తిని వారి కార్యకర్తల్లో ప్రేరేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు. నాడు వైసిపి చర్యలు తిరిగేసినామంటున్నా ఎన్డీఏ పార్టీల వైఖరిని ప్రజలు హేయభావంతో ఉన్నారని. ప్రజల పౌర స్వేచ్ఛను హరించే వారిపై 2029 ఎన్నికల్లో ప్రజల తీర్పు కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

pai nyayaporatamsipiemnamineshanlaskrutnitarvatatiraskarana

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News