05/11/2026, Thursday · 09:02:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఓటమి భయంతోనే ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్న టిడిపి గుండాలు

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 5:57 PM వైఎస్సార్ కడప 7

ఓటమి భయంతోనే ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్న టిడిపి గుండాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • నామినేషన్ కేంద్రాలను నామినేటెడ్ కేంద్రాలుగా మార్చుకున్న అధికార పార్టీ
  • సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కేంద్ర బలగాల రక్షణలో నామినేషన్ మొదలు కౌంటింగ్ వరకు షెడ్యూలు పూర్తి చేయాలి

వైయస్సార్ కడప జిల్లాలో జడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్లను అడ్డుకుంటున్న టిడిపి నాయకులపై చర్యలు తీసుకొని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కేంద్ర బలగాల రక్షణలో నామినేషన్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ మల్లికార్జునుడు ను కలిసి వినతిపత్రం సమర్పించిన సిపిఐ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ (ఏపీ ఎస్ ఇ సి) ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలకు, జడ్పిటిసి లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ 2026 అక్టోబర్ 21 నుండి 23 వరకు నామినేషన్ దాఖలు చేయాలని షెడ్యూలు ప్రకటించింది. అందులో భాగంగా జడ్పిటిసి లకు జిల్లా పరిషత్, ఎంపీటీసీలకు మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 2026 అక్టోబర్ 21న జిల్లావ్యాప్తంగా జడ్పిటిసి ఎంపీటీసీలకు నామినేషన్ వేసేందుకు నామినేషన్ కేంద్రాల వద్దకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకొని వెళితే ప్రారంభంలోనే పోలీసులు, అధికార టిడిపి నాయకులు, రౌడీ మూకలతో మోహరించి నామినేషన్ వేసే అభ్యర్థులను లోపలికి పోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. బయట అవరోధాలను అధిగమించి ఒకవేళ లోపలికి పోయినప్పటికీ అధికార పార్టీ టీడీపీకి చెందిన రౌడీ మూకలు టిడిపికి చెందిన వారు మాత్రమే నామినేషన్లు వేయాలని ఇతరులు ఎవరు నామినేషన్ వేయడానికి వీలు లేదంటూ అడ్డుకోవడమే కాకుండా, నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని, చించేస్తున్నారు, అడ్డు చెప్పిన వారిపై కర్రలతో, రాడ్లతో, కత్తులతో, గాజు సీసాలతో దాడులకు తెగబడుతున్నారు. 2026 అక్టోబర్ 21న 11 గంటలకు జమ్మలమడుగు మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన సిపిఐ అభ్యర్థి రాంప్రసాద్ నామినేషన్ పత్రాలను టిడిపి రౌడీ మూకలు బలవంతంగా లాక్కొని చించేశారు. పోరుమామిళ్ల మండలంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన సిపిఐ అభ్యర్థి పిడుగు మస్తాన్ ను పోలీసులు లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో జడ్పిటిసి స్థానాలకు పోటీ చేసే టిడిపి కానీ అభ్యర్థులను అనుమతించకుండా అడ్డుకోవడం, నామినేషన్ పేపర్లు చించడం, కర్రలు రాడ్లు సీసాలతో దాడులు చేయడం జరుగుతున్నాయి.

ఇదే తరహాలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇచ్చిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం 2026 అక్టోబర్ 16 నుండి 18 వరకు నామినేషన్ వేసేందుకు ఎలక్షన్ కమిషన్ నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే నామినేషన్ వేసేందుకు పోయిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైసిపి మరికొన్ని పార్టీల అభ్యర్థులను టిడిపికి చెందిన రౌడీ మూకలు నామినేషన్ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో కర్రలతో, కత్తులతో, బాటిల్స్ తో దాడి చేసి గాయపరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ అధిగమించి నామినేషన్ కేంద్రంలోకి పోయినప్పటికీ అక్కడ కూడా అధికార టిడిపికి చెందిన రౌడీ మూకలు నామినేషన్ పత్రాలు బలవంతంగా లాక్కొని చించి, అభ్యర్థులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

మునిసిపల్, కార్పొరేషన్ నామినేషన్లలో జరిగిన దాడులు మరువకముందే ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్లు ప్రారంభం నుండే అధికార టిడిపి దౌర్జన్యాలు దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నది.

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో రిటర్నింగ్ అధికారులు నిష్పక్షపాతంగా నామినేషన్లు మొదలు, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ వరకు నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించి అధికార టిడిపి కి వత్తాసు పలుకుతూ ఇతర పక్షాల నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అధికార టిడిపికి పోలీసులు పూర్తిగా కొమ్ముగాస్తు పోలీసుల సమక్షంలోనే టిడిపి మూకలతో దాడులు చేయిస్తున్నారు.

కావున వైయస్సార్ కడప జిల్లాలో జడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్లను అడ్డుకుంటున్న టిడిపి నాయకులపై చర్యలు తీసుకొని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కేంద్ర బలగాల రక్షణలో నామినేషన్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకట్ శివ కేసీబాదుల్లా లింగన్న ఈశ్వరయ్య చంద్రగుప్త రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ఓటమి భయంతోనే ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్న టిడిపి గుండాలు

nominations outTDPgoonsblockingoppositionfeardefeat

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News