05/11/2026, Thursday · 09:02:32 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

​పులివెందులలో టీడీపీ దౌర్జన్య రాజకీయం..

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 11:14 AM వైఎస్సార్ కడప 17

​పులివెందులలో టీడీపీ దౌర్జన్య రాజకీయం..
Want this news as a newspaper clip?Print News Clip

వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఆస్తుల ధ్వంసంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

​పులివెందుల

పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ చేతగాని,దౌర్జన్య రాజకీయాలకు పాల్పడుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రత్యర్థుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దహనం చేయడం,నామినేషన్లను అడ్డుకోవడం వంటి చీప్ పాలిటిక్స్‌కు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.​నామినేషన్లు వేయకుండా పోలీసులతో అడ్డంకులు,కాల్పులు

​ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.నామినేషన్లు వేయాలని చూస్తే ఏకంగా AK-47లతో తమపై కాల్పులు జరిపే పరిస్థితికి దిగజారారని విమర్శించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుని,ప్రజల మద్దతు కూడగట్టుకుని ఎన్నికల్లో గెలవాల్సిన టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.​గడిచిన 10 రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని క్రమపద్ధతిలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని అవినాష్ రెడ్డి వివరాలను వెల్లడించారు.​ముందుగా సునీతక్క అనే మహిళా కార్యకర్తకు సంబంధించిన షాపును కాల్చివేశారని ​అదే షాపు సమీపంలో హరిబాబు అనే కార్యకర్తకు చెందిన రెండు బైకులను తగులబెట్టారన్నారు.​33 వ వార్డు కు పోటీ చేస్తున్న తుగుట్ల మధు సుధన్ రెడ్డి పై పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థి భర్త నిరంజన్ రెడ్డికి చెందిన పెద్ద ట్రక్కును,అలాగే ఆయన ఇంటి పక్కనే ఉన్న వారి మినీ ట్రక్కును తగులబెట్టారని ​తాజాగా సీనియర్ కార్యకర్త,ముఖ్య నాయకుడు నాగరాజుకు చెందిన XUV 500 కారును సైతం నిప్పు పెట్టి పూర్తిగా దగ్ధం చేశారన్నారు.​ఈ విధ్వంసాల వెనుక టీడీపీ కీలక నేతలు ఉన్నారని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో విజయ్,కిరికిరి బాషా,శీను వంటి వ్యక్తులు దాడులకు పాల్పడుతుంటే,వారి వెనుక ఉండి నడిపిస్తున్నది బీటెక్ రవి,నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లేనని ఆయన ప్రత్యక్షంగా ఆరోపించారు.వారి అండ చూసుకునే ఈ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ విధమైన నీచ రాజకీయాలతో కార్యకర్తలను,ప్రజలను తాత్కాలికంగా భయపెట్టవచ్చని అనుకుంటే అది వారి భ్రమేనని,

సమయం వచ్చినప్పుడు పులివెందుల ప్రజలు టీడీపీ నాయకులకు సినిమా చూపించి నియోజకవర్గం నుంచి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.ఈ అరాచకాలకు పాల్పడిన వారినీ,చేయించిన వారినీ ఎవరినీ వదిలిపెట్టబోమని,చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

violent politicsTDPPulivendula

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News