05/11/2026, Thursday · 09:02:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు భద్రత

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 11:07 AM వైఎస్సార్ కడప 7

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు భద్రత
Want this news as a newspaper clip?Print News Clip
  • జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన జరుగుతున్న కేంద్రాలు, సంబంధిత కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎటువంటి సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు గుమికూడకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా, నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల అధికారులు తమ విధులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ మొత్తం శాంతియుతంగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు భద్రత
ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు భద్రత

police securityTightscrutinyterritorialelectionnominations

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News