ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఎస్.బి. అంజాద్ భాష

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారికి మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈరోజు కడప నగరంలోని కడప నగరంలోని బచ్చుంపల్లి, ఖాదర్ ఖాన్ కొట్టాల్ నందు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను, ఓటర్లను కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి కి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష మాట్లాడుతూ, కడప నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని, ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, కడప నగర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జ్ రమణ, చెన్నారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, చంద్ర, మధుసూదన్ రెడ్డి,ఈశ్వర్, సురేష్, నరసయ్య,నయీమ్, శివ, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












