05/11/2026, Thursday · 08:34:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఫుల్లుగా తాగేశారు.. దసరాకు రూ.68.93 కోట్ల మద్యం అమ్మకాలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 2:06 PM వరంగల్ 7

ఫుల్లుగా తాగేశారు.. దసరాకు రూ.68.93 కోట్ల మద్యం అమ్మకాలు
Want this news as a newspaper clip?Print News Clip

 దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 295 వైన్‌ షాపులు, 139 బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రూ.68.93కోట్ల మద్యాన్ని లిక్కర్‌ డిపోల నుంచి విక్రయించినట్లుగా ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20న దసరా పండుగ జరగగా 17న రూ.38.10 కోట్ల విలువ చేసే 27,211 కేసుల లిక్కర్‌, 72,885 కేసుల బీర్‌లు అమ్ముడుపోగా, 18న అదివారం సెలవు పోగా, 19న రూ.30.42కోట్ల విలువ చేసే 24,491 కేసులు లిక్కర్‌, 49,803 కేసుల బీర్‌లు విక్రయాలు జరిగాయి. ఓవరాల్‌గా ఈ నెల 1 నుంచి 19వ తేదీవరకు విక్రయాలను పరిశీలించినట్లయితే రూ.222.13 కోట్ల విలువ చేసే 3,64,998 కేసుల లిక్కర్‌, 1,75,430 కేసుల బీర్‌లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేల్‌ అయ్యాయి.ఈ లెక్కన ఒక్కరోజుకు సగటున రూ.11 కోట్లకు పైగా మద్యం సేల్‌ కాగా, దసరా సందర్భంగా రెండు రోజుల్లోనే రూ.68.93కోట్ల మద్యం అమ్ముడుపోయి ఎక్సైజ్‌శాఖ ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఆదాయం సమకూరింది. ఈ నెల 1 నుంచి 19 వరకు జిల్లాల వారీగా జరిగిన విక్రయాల్లో వరంగల్‌ అర్బన్‌లోని మద్యం షాపులు రూ.83.63 కోట్లతో ముందంజలో ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Liquor SalesDrunkCroresDussehra

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News