05/11/2026, Thursday · 08:34:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో పలు రైళ్ల రద్దు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:36 AM వరంగల్ 17

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
Want this news as a newspaper clip?Print News Clip

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా ప్రయాణికుల భద్రతలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వరంగల్‌ మీదుగా ప్రతీరోజు రాకపోకలు సాగించే గోదావరి (12728), మహబూబ్‌నగర్‌ విశాఖపట్టణం (12862), కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ (12776), గౌతమి ఎక్స్‌ప్రెస్‌ (12738), నాందేడ్‌ సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20810) రైళ్లను రద్దు చేశారు. అలాగే రద్దయిన రైళ్ల వివరాలతో పాటు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల సమాచారం అందించేందుకు వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌డె్‌స్కను ఏర్పాటు చేశారు.రైల్వే టికెట్‌ కలెక్టర్లు ఈ సహాయక కేంద్రంలో కూర్చుని తుఫాన్‌ కారణంగా పూర్తిగా రద్దు చేసిన, పాక్షికంగా రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను ప్రయాణికులకు చెబుతున్నారు. అలాగే గతంలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకల వివరాలు టికెట్‌ బుకింగ్‌ సమయంలో నమోదు చేసిన తమ మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో వస్తుందని టికెట్‌ కలెక్టర్లు వివరిస్తున్నారు. రైళ్ల తాజా సమాచారం కోసం రైల్వే విచారణ 139 నంబరుకు డయల్‌ చేయాలని హెల్ప్‌లైన్‌లో చెబుతున్నారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ సుదర్శన్‌, ముఖ్య కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జాఫర్‌ పర్యవేక్షణలో హెల్ప్‌లైన్‌ సిబ్బంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారు.

దీపావళికి ప్రత్యేక రైలు

దీపావళి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్‌ మీదుగా తిరువనంతపురం - హజ్రత్‌నిజాముద్దీన్‌(న్యూఢిల్లీ) మార్గంలో నవంబరు 2 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్‌ మంగళవారం తెలిపారు. తిరువనంతపురం - హజ్రత్‌నిజాముద్దీన్‌(06073) ప్రత్యేక రైలు నవంబరు 2 నుంచి 16 వరకు ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురంలో బయలుదేరి బుధవారం రాత్రి 11.50 గంటలకు హజ్రత్‌ నిజాముద్దీన్‌ చేరుకుంటుందని అన్నారు.

అలాగే హజ్రత్‌నిజాముద్దీన్‌ - తిరువనంతపురం (06074) ప్రత్యేక రైలు నవంబరు 5 నుంచి 19వ తేదీ వరకు ప్రతీ గురువారం ఉదయం 5.45 గంటలకు హజ్రత్‌నిజాముద్దీన్‌ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 4.30 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక రైలులో 3 ఎకానమి, స్లీపర్‌ కోచ్‌లు ఉంటాయని, ఖమ్మం, వరంగల్‌, మంచిర్యాల, సిరిపూర్‌కాగజ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

trains cancelledSeveralwakeCycloneArnab

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News