05/11/2026, Thursday · 08:33:19 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:48 AM విశాఖపట్నం 11

విశాఖలో తుఫాన్ ముప్పు.. ప్రజలకు కలెక్టర్ అత్యవసర విజ్ఞప్తి
Want this news as a newspaper clip?Print News Clip

విశాఖలో తుఫాన్‌ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అత్యవసర విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని... వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అధికారులు తరలింపు ఆదేశాలు జారీ చేస్తే వెంటనే సహకరించాలని తెలిపారు.వరదనీటితో నిండిన రహదారులు, వాగులు, పొంగిపొర్లే డ్రైనేజీలను దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని... ప్రమాదాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తాగునీరు, మందులు, అవసరమైన నిత్యావసరాలు, ముఖ్యమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రైతులు, పశువుల యజమానులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. పంటలు, పశువులు, వ్యవసాయ పరికరాల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.పుకార్లను నమ్మవద్దని.. వ్యాప్తి చేయవద్దని కలెక్టర్ తెలిపారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని కోరారు. ‘అత్యవసరం కాని ప్రయాణాలను నివారించండి... మీ భద్రతతో పాటు కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ అప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ. అధికారుల సూచనలను నిర్లక్ష్యం చేయవద్దు. అత్యవసర పరిస్థితుల్లో సహకరించండి. ప్రాణాలను కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలనూ కాపాడండి’ అంటూ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వినతి చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

urges peopleCyclonethreatVisakhapatnamCollector

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News