05/11/2026, Thursday · 08:33:18 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 11:23 AM విశాఖపట్నం 7

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
Want this news as a newspaper clip?Print News Clip
  • రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు తక్షణ సాయం అందించి హోం మంత్రి..
  • అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు తక్షణ సాయం అందించి హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలోని ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్‌టీఎస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూటీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా పాయకరావుపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న హోం మంత్రి వంగలపూడి అనిత.. రోడ్డు ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని నిలిపివేశారు.హుటాహుటిన రోడ్డు ప్రమాద బాధితుల వద్దకు చేరుకున్నారు. వెంటనే ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు తక్షణ సాయం అందించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

injured studentsHomeMinisterAnithahelpsroadaccidentVisakhapatnam

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News