05/11/2026, Thursday · 08:33:16 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆర్నబ్ తుపాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: జీవీఎంసీ కమిషనర్

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 12:45 PM విశాఖపట్నం 12

ఆర్నబ్ తుపాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: జీవీఎంసీ కమిషనర్
Want this news as a newspaper clip?Print News Clip

 ఆర్నబ్ తుపాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నంలోని నార్త్, వెస్ట్ జోన్లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశామని అన్నారు. కోండ వాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతకు తక్షణమే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.ఆర్నబ్ తుపాన్ నేపథ్యంలో వర్షాలు, ఈదురుగాలులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. అలాగే అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు. చెట్లు కూలడం, కాలువలు పొంగి పొర్లడం, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు స్పష్టం చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009, వాట్సాప్ 90142 18870 నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అత్యవసరమైతే..ఈ నంబర్లకు కాల్ చేయాలని ప్రజలను జీవీఎంసీ కమిషనర్ కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

GVMC CommissionerReadydealCycloneArnab

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News