05/11/2026, Thursday · 08:58:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ఈటల మహాపాదయాత్ర ప్రారంభం

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 10:40 AM హైదరాబాద్ 13

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ఈటల మహాపాదయాత్ర ప్రారంభం
Want this news as a newspaper clip?Print News Clip

జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈరోజు ఏదులాబాద్ నుంచి మొదలై నాలుగో రోజు జవహర్ నగర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజిగిరిలో డంపింగ్ యార్డు సమస్య వల్ల లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని తెలిపారు.విపరీతమైన చెత్త వల్ల ఆ ఏరియా నుంచి ముప్పై కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని ఎంపీ అన్నారు. దీనిపై అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని విమర్శించారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యను తానే స్వయంగా ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకురావాలి ఈ యాత్ర మొదలు పెట్టినట్లు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభమైందన్నారు. నాలుగో రోజు మహాసభ నిర్వహించి పాదయాత్రను ముగిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

evacuation beginsJawaharnagarDumpingYardEtalaMahapadayatra

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News