05/11/2026, Thursday · 09:02:29 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

‘వీఐటీ ఈఈఈ’ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:35 PM జాతీయం 7

‘వీఐటీ ఈఈఈ’ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
Want this news as a newspaper clip?Print News Clip

‘వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఈఈఈ’ 2027 పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీర్లు కావాలని ఆశించే విద్యార్థులు తమ కలల వృత్తి వైపు అడుగు వేసేందుకు ఇది ఒక మంచి అవకాశమని వీఐటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వేలూరు, చెన్నై, అమరావతి (ఆంధ్రప్రదేశ్‌) క్యాంప్‌సలలో అందించే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం జ్ట్టిఞట://ఠిజ్ట్ఛ్ఛ్ఛీ.ఠిజ్టీ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీఐటీ ఈఈఈ 2027 పరీక్ష ఒకే దశలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 133 నగరాల్లో, అంతర్జాతీయంగా 9 కేంద్రాల్లో జరుగుతుంది. దీని వల్ల భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

darakhastula ahvanamviaitiiiiparikshaku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News