05/11/2026, Thursday · 09:02:27 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌀

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 10:47 AM రాష్ట్ర వార్తలు 6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌀
Want this news as a newspaper clip?Print News Clip

రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

🚨 🆘 అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు (SEOC):

📞 112 | 📞 1070 | 📞 1800 425 0101

🌪️ తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 🌪️

📌 తుపానుకు ముందు:

* ❌ పుకార్లను నమ్మవద్దు; ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.

* 📱 అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసి ఉంచుకోండి. విపత్తుల సంస్థ హెచ్చరిక SMSలను గమనించండి.

* 📻 రేడియో/టీవీ వార్తలు చూడండి, వార్తాపత్రికలు చదవండి.

* 📄 విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోండి.

* 📦 అత్యవసర వస్తు సామగ్రిని (Emergency Kit) ముందే సిద్ధం చేసుకోండి.

* 🏠 ఇంటి పైకప్పును భద్రపరుచుకోండి, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయండి.

* 🌊 వరదలు/ఉప్పెన ముప్పు ఉంటే వెంటనే ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయ ప్రాంతానికి వెళ్లండి.

* 🍞 కనీసం ఒక వారానికి సరిపడా ఆహారం, తాగునీరు నిల్వ ఉంచుకోండి.

* 🚪 తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయండి.

* 🗣️ అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి.

🏠 తుపాను సమయంలో (ఇంట్లో ఉంటే):

* 🔌 ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి; గ్యాస్ కనెక్షన్లను తొలగించండి.

* 🚪 తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.

* 🏚️ ఇల్లు సురక్షితం కాకపోతే ముందే సురక్షిత షెల్టర్‌కు చేరుకోండి.

* 💧 కాచి చల్లార్చిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగానండి.

* 🛡️ భవనం దెబ్బతినే సూచనలు ఉంటే బలమైన టేబుల్ లేదా బెంచ్ కింద మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

🚶‍♂️ తుపాను సమయంలో (బయట ఉంటే):

* 🚫 దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి వెళ్లవద్దు.

* 🌳 చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఎప్పుడూ నిలబడవద్దు.

* ⚠️ గాలి తగ్గినా తుపాను ముగిసిందని అనుకోవద్దు; అధికారులు 'ఆల్ క్లియర్' ప్రకటించే వరకు వేచి ఉండండి.

🌤️ తుపాను తరువాత:

* 💧 కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి.

* 📢 అధికారిక సమాచారం వచ్చేవరకు షెల్టర్ వదిలి బయటకు/ఇంటికి వెళ్లవద్దు.

* ⚡ తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర జాగ్రత్త వహించండి.

* 🔌 దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వాడండి.

🎣 మత్స్యకారులు చేయవలసినవి:

* 🚫 సముద్రంలోకి వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు.

* 📱 మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచుకోండి.

* 📻 అదనపు బ్యాటరీలతో రేడియోను సిద్ధంగా ఉంచుకోండి.

* ⚓ పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచండి.

 మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Management AgencyAndhraPradeshStateDisaster

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News