05/11/2026, Thursday · 09:02:33 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 4:19 PM రాష్ట్ర వార్తలు 4

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
Want this news as a newspaper clip?Print News Clip
  • ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. మరో వైపు నవరాత్రులు చివరి రోజు కావడంతో దుర్గమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు ఈ రోజుతో ముగుశాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

visits DurgammaGovernorJusticeAbdulNazeer

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News