యువ నాయకుడు రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డి జన్మదిన వేడుకలు

- పాల్గొన్న టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి
కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువ నాయకుడు రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ వేడుకల్లో టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేయించారు. అనంతరం శ్రావణ్ రాజ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువజన విభాగ సభ్యులు పాల్గొని శ్రావణ్ రాజ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













