05/11/2026, Thursday · 09:02:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కడప నగరంలో వ్యక్తిగత కారణాలతో యువకుడిపై కత్తితో దాడి

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 10:49 PM వైఎస్సార్ కడప 5

కడప నగరంలో వ్యక్తిగత కారణాలతో యువకుడిపై కత్తితో దాడి
Want this news as a newspaper clip?Print News Clip

కడప నగరంలోని సంగంపేట రాముల గుడి సమీపంలో 25.10.2026వ తేదీన సాయంత్రం సుమారు 05.10 గంటల సమయంలో షేక్ అలీ ఖలీద్ (30) అనే యువకుడిపై సయ్యద్ బాషా (30) అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, గత కొంతకాలంగా ఇరువురి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా సయ్యద్ బాషా, అలీ ఖలీద్‌ను కత్తితో కడుపులో పొడవడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. దాడిని అడ్డుకునే క్రమంలో అలీ ఖలీద్ ఎడమ చేతికి, మాజీ కార్పొరేటర్ షేక్ షంషీర్ బాషా చేతికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారు కడప హోలిస్టిక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలు మరియు గత విభేదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనను రాజకీయాలకు ముడిపెట్టి అవాస్తవ ప్రచారాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.

ఈ ఘటనపై కడప రెండవ పట్టణ యు/జి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

youth attackedKadapacityknifepersonalreasons

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News